మధురానగర్ కమాన్ వద్ద ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

నవపక్షం, కుతుబుల్లాపూర్ నియోజవర్గ ప్రతినిధి : 

మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండలం, నిజాంపేట్ సర్కిల్, ప్రగతి నగర్ డివిజన్ లోని మధురానగర్ కమాన్ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
అనంతరం రచ్చ చక్రధర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం నియంత పాలన నుండి, రజాకార్ల దౌర్జన్యాల నుండి మనల్ని విముక్తి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ రోజును అధికారికంగా విమోచన దినంగా జరపడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని నిజాం వారసత్వాన్ని కాదు, భారతీయతను చాటుదాం అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు మాట్లాడుతూ ఇది విమోచన దినం మాత్రమే కాదు, ఆత్మగౌరవ దినం. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కాకపోతే, తెలంగాణ పరిస్థితి వేరేలా ఉండేది” అని అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, నిజాం నిరంకుశ పాలన, ఆపరేషన్ పోలో విశిష్టతను వక్తలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు MRS రాజు, హిందూ సంఘాల ప్రతినిధి లలిత్ కుమార్, బీజేపీ నాయకులు నామాల శ్రీనివాస్, సుభాష్, సత్యనారాయణ, బాబు చౌదరి, సత్య, శివ గుప్త, సతీష్, కిషోర్, VHP ప్రతినిధులు వెంకటేష్, అంజి తో పాటు స్థానికులు చక్రవర్తి, అరవింద్, ఆనంద్, మహేష్, పవన్, దత్తు, రవి శంకర్, యాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.