నవపక్షం, మద్నూర్, సెప్టెంబర్ 17 :
గణేష్ నిమజ్జనంలో డీజేకు అనుమతి లేకపోవడంతో నష్టపోయిన ఉత్సవ నిర్వాహకులకు మద్నూర్ పోలీసులు న్యాయం చేశారు.
మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్ మండలి నిర్వాహకులు రెండు నెలల ముందే ఖండేబల్లూర్ కు చెందిన డీజే నిర్వాహకుడికి రూ.5 వేలు అడ్వాన్స్ చెల్లించారు. ఇటీవల డీజేలపై నిషేధం ఉందని పోలీసులు ప్రకటించడంతో డీజేను రద్దు చేసుకున్నారు.
అడ్వాన్స్ తిరిగి రాకపోవడంతో బాధితులు ఎస్సై మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎస్సై ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి రూ.5 వేలు తిరిగి ఇప్పించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.


