నవపక్షం,శాలిగౌరారం మండల ప్రతినిధి :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తోట వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,తుంగతుర్తి బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దాదాపు 1000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమం లో కడియం రామచంద్రయ్య,వినోద్ లు మాట్లాడుతూ.నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మరో కొన్నేళ్లు ప్రధానమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా ఉపాధ్యక్షుడు మేడబోయిన యాదగిరి,జిల్లా కార్యదర్శి గిరగాని యాదగిరి గౌడ్,జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్ కే సయ్యద్,మండల కార్యదర్శి చాడా శ్యామ్ సుందర్ రెడ్డి,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు వేముల ఆంజనేయులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


