నవపక్షం, నల్లగొండ ప్రతినిధి :
నల్లగొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో కర్నాటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ డీఎస్పీ గౌరవనీయులు శివరామిరెడ్డి హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శివరామిరెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ్ నేత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

