నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :
కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాచకొండ జానకిరాములు గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, గ్రామ ప్రజలతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాచకొండ జానకిరాములు గౌడ్ పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం ప్రజలందరికీ శుభాలను, సుఖసంతోషాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో పండుగలను జరుపుకోవాలని కోరారు.
గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. వినాయకుడి దర్శనం కోసం గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


