నవపక్షం, శేరిలింగంపల్లి మండల ప్రతినిది:
శేర్లింగంపల్లి మండలం లింగంపల్లిలో విద్యావారాధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా నైట్ వేడుకలు ఘనంగా జరిగాయి. కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం. శివకుమార్ ఆహ్వానం మేరకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎం. రవి కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు దాండియా నైట్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నిర్వాహకులు, స్థానికులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగిన ఈ వేడుకల్లో యువత, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దాండియా నైట్‌ను విజయవంతం చేసేందుకు సహకరించిన అతిథులు, స్థానికులు, యువత, మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.


