నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ మహా గజకర్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు లాపంగి యాదయ్య, సిరిపంగి జంగయ్య, లాపంగి కృష్ణ, లాపంగి సుదర్శన్, లాపంగి మహేందర్ తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


