నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23:
వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారో లాగ్‌బుక్‌లో నమోదైన వివరాలను వెల్లడించాలని విద్యుత్ శాఖ అధికారులను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు.
రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరాకు సంబంధించిన లాగ్‌బుక్ వివరాలను చూపించాలని ఆయన అధికారులను కోరినప్పటికీ, అధికారులు వెంటనే స్పష్టమైన వివరాలు వెల్లడించలేదని తెలిపారు. సరఫరా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేస్తామని అధికారులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
రైతులకు న్యాయమైన విద్యుత్ సరఫరా అందడం లేదని, నిర్ణయించిన సమయాల్లో కూడా విద్యుత్ సరఫరా జరగడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఇకపై అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
రైతులకు నిర్దేశిత సమయాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు.


