నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :
గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకుడిని కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగూడెం కాలనీలో సుందరంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూలమాలలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వినాయకుడికి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించి గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
పూజా కార్యక్రమంలో జానకి రాములు, గద్దపాటి మణి కుమార్, సాయికుమార్, చంటి, శంకర్, జానయ్య, శివ (చింటూ), రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.


