ప్రముఖ నిపుణుడి మార్గదర్శకత్వంలో విద్యార్థులకు అవగాహన

నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :

మండలంలోని మెదిచంద్రాపురం పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి “మెంటరింగ్ బై ఎమినెంట్ ఎక్స్‌పర్ట్స్ – ఇంటర్నేషనల్ అండ్ నేషనల్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్రముఖ నిపుణుల అనుభవాలు, జ్ఞానం, మార్గదర్శకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ బి.ఈడీ కళాశాలలో సైకాలజీ లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ బురుగుల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో చదువుతో పాటు మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనా విధానం ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, సందేహాలు, అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా వాటిని అనుభవాలుగా తీసుకోవాలని తెలిపారు. తమపై తమకు నమ్మకం, సమయపాలన, ఏకాగ్రత, మంచి అలవాట్లు విజయానికి దోహదపడతాయని వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ విద్య, కెరీర్‌ ఎంపికల విషయంలో ముందుగానే అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి వారికి తగిన మార్గదర్శకత్వం అందించాలని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వివిధ రంగాల్లో నిపుణుల మార్గదర్శకత్వం అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఏర్పడేందుకు దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. కరుణాకర్, జి. సబిత, పి. శ్రీనివాస్, వి. దొరతి, జి. మాధురి, పి. లింగస్వామి, డి. భవాని, కె. నాగమనీషా, ఎన్. వెంకటయ్య, మహమ్మద్ రజియుద్దీన్, బి. సూర్యకుమారి, టి. అనురాధ, బి. కోమలి, జె. విజయ, సాజిద, యాదయ్య, శంకర్, నసరత్, చంద్రమౌళి, సమతా, వెంకటరమణ, లక్ష్మీ, రామ్ నరేష్,కొండల్ తదితర ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రముఖ నిపుణుడి సూచనలు, సలహాలతో కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా సాగింది.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.