నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :
నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం విఘ్నేశ్వరుడి నిమజ్జనంతో ఘనంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
ఈ నిమజ్జన కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సైదులు, మాజీ ఉప సర్పంచ్ గుండెబోయిన సైదులు, ఐతం సైదులు, పద్మారెడ్డి తదితరులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు భక్తిగీతాలు, నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది.


