నవపక్షం, గూడూరు ప్రతినిధి :
గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గూడూరు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపి నాయక్ నియమితులయ్యారు.
ప్రత్యేక అధికారిగా కోట మండల పరిషత్‌కు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగనున్నారు.
మండల పరిషత్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపి నాయక్‌కు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
గోపి నాయక్ నియామకం పట్ల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


