నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :
మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి జిల్లా జర్నలిస్ట్ రంగ కవిత తండ్రి రంగ స్వామి గౌడ్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్, రంగ కవిత ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రంగ స్వామి గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.


