నవపక్షం, పెందుర్తి :
పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ గైస్ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జి గండి బాబ్జీ హాజరయ్యారు. అలాగే పెందుర్తి మార్కెట్ చైర్మన్ ఆవగడ్డ అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, పెందుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, పెందుర్తి మండలం టీడీపీ అధ్యక్షుడు కనుగంటి కనకరాజు, పినగాడి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బైలపూడి హరగోపాల్, పెందుర్తి మండలం తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు బీవీవీ ప్రసాద్, ఒడిబోయిన సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నసమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


