Sunday, November 8, 2026

పట్టభధ్రులందరు ramreddysarvotham.com లో దరఖాస్తు చేసుకోవాలి – పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది:

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పీసీసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, నిర్ణీత గడువులోగా నమోదు పూర్తయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.పట్టణ, మండల స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వయంగా పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఒక్కరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తదితర అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందేలా చూడాలని పేర్కొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.