ఉద్యమకారుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం: బీర్ల అయిలయ్య

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :

యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బీర్ల అయిలయ్య తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను, సమయాన్ని, శక్తిని ధారపోశారని పేర్కొన్నారు.

ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీర్ల అయిలయ్య అన్నారు.

Hot this week

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి :  ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి...

మణిదీప్‌ జన్మదిన &నామకరణ వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటం బహూకరణ

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :  కొమురం భీం ఆసిఫాబాద్...

ఘనంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మనవరాలు శాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : మాజీ ఐఏఎస్‌, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్...

పాటే ఆయుధంగా.. గళమే గుర్తింపుగా మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి ప్రస్థానం

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి: మారుమూల గ్రామీణ ప్రాంతం, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి...

Topics

దళిత సంఘాల ఐక్యతతో హక్కుల సాధనకు ఉద్యమించాలి

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి:  దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం,...

నల్గొండలో కూలీ హత్య ఘటన

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.