నవపక్షం, చౌటుప్పల్ /
అక్టోబర్ 02 :
భారతమాత ముద్దుబిడ్డలు సమరయోధులు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మా గాంధీ గారి మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి వేడుకలు చౌటుప్పల్ లోని రాజీవ్ స్మారక భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రాజీవ్ స్మారక ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖయ్యూం చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బోయ దేవేందర్ చౌటుప్పల్ మున్సిపల్ ప్రెసిడెంట్ కాసర్ల శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ మాజీ ప్రెసిడెంట్ సుర్వి నరసింహ గౌడ్ రాజీవ్ స్మారక ఆర్గనైజర్ సెక్రెటరీ నల్ల నరసింహ జిల్లా కాంగ్రెస్ నాయకులు నందగిరి భీమయ్య రామాలయ ధర్మకర్త ఆవుల యేసు యాదవ్ మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెరుకు లింగస్వామి మండల ప్రచార కార్యదర్శి యాస నరసింహారెడ్డి ఐఎన్టియుసి బ్లాక్ ప్రెసిడెంట్ కంచర్ల జంగయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదాని గోపాల్ ఐఎన్టియుసి చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా నాయకులు సుర్కంటి భగవంతు రెడ్డి ప్రభాకర్తదితరులు పాల్గొన్నారు


