నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి.
వికారాబాద్ మున్సిపాలిటీ 24వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల రుచిత సాయిచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో అపోలో ఆస్పత్రి, మరియు జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్ & సర్జన్, కంటి వైద్య నిపుణులు, ఆర్థోపెడిక్ మరియు గైనకాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు.
24వ వార్డుకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 105 మంది ప్రజలు వైద్య పరీక్షలు మరియు వైద్య సేవలు పొందారు.
ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కౌన్సిలర్ చిట్యాల రుచిత సాయిచరణ్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు.


