నవపక్షం, నవపక్షం ప్రతినిధి :
టేకులపల్లి గ్రామంలో అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ చారి అన్నారు. సోమవారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అందరికీ రేషన్ కార్డులు అందుతాయని ఎలాంటి భయాందోళనలు చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి భాస్కర్, నరేష్ గౌడ్, జిపిఏ శ్రీనివాసరెడ్డి, డీలర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

