Sunday, November 8, 2026

పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

నవపక్షం, కోట మండల ప్రతినిధి : 

పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని అంగన్‌వాడీ సూపర్వైజర్ ఐ. కిష్టమ్మ అన్నారు. చిన వంజివాక అంగన్‌వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఐ. కిష్టమ్మ ఆధ్వర్యంలో పోషకాహార మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఐ. కిష్టమ్మ మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి బరువు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహారంతో పాటు ఐదుగురు గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లితో పాటు శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
పరిశుభ్రత కూడా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని సూపర్వైజర్ పేర్కొన్నారు. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శుద్ధమైన తాగునీటిని వినియోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు.
అదేవిధంగా కిశోర బాలికలు ఎదుగుతున్న వయస్సులో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సూచనలను పాటించాలని కోరారు. “ఆరోగ్యవంతమైన తల్లి.. ఆరోగ్యవంతమైన బిడ్డ.. ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది” అనే విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తించాలని, పోషకాహారంపై కుటుంబాల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐ. కిష్టమ్మ సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవిద్య, అనిత, సరోజనమ్మ, రేవతి, విజయలక్ష్మి, మల్లికార్జున, అమ్మ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.