నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 8:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ నేతృత్వంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంధం నాగరాజు, ఎస్. సాయి శ్రీనివాసు, ఎం.డి. గౌస్, జే. పెంటయ్య పాల్గొని గ్రామ ప్రజలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
బాల్యవివాహాల నివారణ, బాల కార్మికుల నిర్మూలన, మత్తుపదార్థాల దుష్ప్రభావాలు, ప్రాథమిక హక్కులు–బాధ్యతలు, ప్రభుత్వ పథకాలు, గ్రామ సమస్యలు, చట్టాలు, న్యాయపరమైన సెక్షన్లపై ప్రజలకు వివరించారు.
ప్రజలు తమకు ఉన్న న్యాయపరమైన హక్కులను తెలుసుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయసేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంపీఓ చంద్రశేఖర్, పాలకవర్గ సభ్యులు దొడ్ల అండలు శెట్టయ్య గౌడ్, బొమ్మని శ్రావణి స్వామి గౌడ్, రాపోలు రేణుక మల్లేష్, పంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండుగౌడ్, భీమగోని మల్లేశం గౌడ్, పర్ణ శ్రీనివాస్ రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, యాట శంకరయ్య, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘం అధ్యక్షురాలు పెండెం లక్ష్మి, గ్రామ మహిళలు, యువకులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


