నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :
సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా మర్రిగూడలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో స్వచ్ఛ భారత్‌పై వ్యాసరచన పోటీలు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, స్వచ్ఛమైన సమాజ నిర్మాణంపై బాధ్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా మర్రిగూడ ఎస్సై రాంబాబు, పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సెమినార్లో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మై భారత్ యూత్ వాలంటీర్ వెంకటంపేట ఆంజనేయులు, ఉపాధ్యాయులు లింగస్వామి, యాదయ్య, శ్రీహరి, పగడాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


