నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బతుకమ్మను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ పండుగ విశిష్టతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచకొండ నాగమ్మ అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కొండ శంకర్ గౌడ్, ఉపసర్పంచ్ చిత్తలూరి జానయ్య, వార్డు సభ్యుడు రాచకొండ సతీష్, నాయకులు రాచకొండ శ్రీను, కొప్పు రాంబాబు, అభిరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


