నవపక్షం, ఆలేరు ప్రతినిధి :
బేగంపేట గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధల వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ దాతలు బద్దం మధుసూదన్ రెడ్డి, జిట్ట ఉదయ్ కిరణ్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ప్రదీప్, సుమన్, రాజేష్ రాజు, శశి, మదన్ తదితరులు పాల్గొన్నారు.


