నవపక్షం, కోట ప్రతినిధి:
సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు లోని SS కన్వెన్షన్ హాల్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్ గారిని కలిసి కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లిన సమాజ చైతన్య సమితి మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు.
ఆయన త్వరలో ఒక కార్యాచరణతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి ప్రెసిడెంట్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, తిరుమూరు క్రిష్ణయ్య, పంట్రంగం వసంత్, యన్.బాబు, బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్, లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, గౌరవ సలహాదారులు కనుపూరు క్రిష్ణయ్య, కో కన్వీనర్ తూపిలి వినోద్, తదితరులు పాల్గొన్నారు.


