నవపక్షం, జుక్కల్ ప్రతినిధి :
అంతాపూర్ గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్న ‘ఎడ్గి ప్రీమియర్ లీగ్’ (EPL) క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ చాటిన ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును ప్రధానం చేశారు. అంతాపూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షులు వాగుమరే మారుతి చేతుల మీదుగా విజేతకు ఈ బహుమతిని అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా వాగుమరే మారుతి మాట్లాడుతూ… అంతాపూర్ టీమ్‌కు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ, టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడికి తన చేతుల మీదుగా పురస్కారం అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడల పట్ల ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
తనపై నమ్మకంతో ఈ గౌరవ బాధ్యతను అప్పగించిన అంతాపూర్ గ్రామ మేనేజ్మెంట్కు, అలాగే టోర్నమెంట్‌ను ఎంతో అద్భుతంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న ‘ఎడ్గి ప్రీమియర్ లీగ్’ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, నిర్వాహకులు, క్రీడాకారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


