నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాల జాబితాలో నాంపల్లి శివకు చోటు లభించింది.
రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ సూచనల మేరకు, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాంపల్లి మండలంలో యువతను సంఘటితం చేస్తూ, యువ మోర్చాను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా నాంపల్లి శివ పనిచేయనున్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, యువత సమస్యల పరిష్కారానికి, పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి అంకితభావంతో కృషి చేస్తానని నాంపల్లి శివ పేర్కొన్నారు.
నాంపల్లి మండల యువ మోర్చా అధ్యక్షుడిగా నాంపల్లి శివ నియామకం పట్ల స్థానిక యువత, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.


