నవపక్షం, వేములపల్లి ప్రతినిధి :
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఇరుగుదిండ్ల నరేష్ ను భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రకటించడం జరిగింది. శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఇరుగుదిండ్ల నరేష్ మిర్యాలగూడ నియోజకవర్గ యువమోర్చాలో కీలక నేతగా పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులు ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్ బిజెపి వార్డు మెంబర్ గా గెలవడంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియమాపకానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి చిల్లం చర్ల అభి మండల పార్టీ అధ్యక్షులు భరత్ కి ధన్యవాదాలు తెలిపారు.


