నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి :
వంగమర్తి గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గుండె అరుణ్ కుమార్ (MRPS మండల ఉపాధ్యక్షులు), కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు మెంబర్ రాయవరపు గోపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజవెల్లి భద్రయ్య, వెంకన్న రూపని వెంకన్న, గోళ్ల రవి, సిరికొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.


