Sunday, November 8, 2026

ఓయూలో కట్టమైసమ్మ ఆలయ ఘటనపై 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి – జీవన్, ఏబీవీపీ

నవపక్షం, హైదరాబాద్, ప్రతినిధి : 

ఉస్మానియా యూనివర్సిటీలోని మోయిన్ చెరువు సమీపంలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించిన గేట్లు ధ్వంసమైనట్లు, అమ్మవారి విగ్రహం, హారతి సామగ్రి, గంటలు, నైవేద్య పాత్రలు కనిపించకుండా పోయినట్లు వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి, బాధ్యులుగా గుర్తించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఘటనకు సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్థనా స్థలాల భద్రత, విద్యార్థుల ఆస్తిక భావాలు, మతపరమైన విశ్వాసాలకు గౌరవం కల్పించడం సంబంధిత అధికారుల బాధ్యతని జీవన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

24 గంటల్లో బాధ్యులను గుర్తించి, చట్టప్రకారం అరెస్టు చర్యలు చేపట్టాలి

కట్టమైసమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఘటనలో బాధ్యులను 24 గంటల్లో గుర్తించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జీవన్ పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఈ గడువులోగా స్పష్టమైన చర్యలు చేపట్టకపోతే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులతో కలిసి డీజీపీ కార్యాలయం వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, ఆలయ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విచారణ పురోగతిపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని జీవన్ కోరారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.