నవపక్షం, మండపేట ప్రతినిధి :
మండపేట నియోజకవర్గ ప్రజలకు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. దుర్గాభవాని మాత దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని ఆకాంక్షించారు. మండపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ కూటమి విజయానికి, నియోజకవర్గ ప్రగతికి తోడ్పడుతున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ దసరా పర్వదినం కొత్త వెలుగులు నింపాలని, విజయదశమి పండుగను కుటుంబ సమేతంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

