నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి :
తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) తెర్లాం, కొత్తవలస మండలాల జెడ్పీటీసీ అభ్యర్థిగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన), ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BUDA) చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు కార్యక్రమం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సిరి సహస్రకు మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.


