నవపక్షం, జడ్చర్ల ప్రతినిధి :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ క్రమంలో జడ్చర్ల నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి ని నియమించారు.
పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జడ్చర్ల నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి కి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.


