నవపక్షం, అచ్చంపేట ప్రతినిధి :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వివిధ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిగా శుభప్రద్ పటేల్‌ను నియమించారు.
ఈ సందర్భంగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతను అప్పగించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు శుభప్రద్ పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.


