నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
దేవరకొండ మండలం బండమిదితండా – శకృతండా మధ్య రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. గత మూడేళ్లుగా కంకర పరిచి వదిలేయడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని తండావాసి జటావత్ ప్రకాష్ నాయక్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి రహదారి పనులను పూర్తి చేయాలని కోరారు.


