Sunday, November 8, 2026

రహదారి సమస్య పరిష్కరించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం

నవపక్షం, కాకినాడ ప్రతినిధి :

కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం ఆర్యవటం శివారు తుమ్మలపల్లి లంకలో గత 15 నెలలుగా రహదారి సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. తక్షణమే రహదారిని పునరుద్ధరించకపోతే ఎన్నికల్లో ఓటు వేసే ప్రసక్తే లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.

గత సార్వత్రిక ఎన్నికల అనంతరం తలెత్తిన వివాదం కారణంగా గ్రామానికి వెళ్లే రహదారిని ధ్వంసం చేయడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు తమ పొలాలకు వెళ్లేందుకు, వ్యవసాయ పనులు నిర్వహించేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా కష్టతరంగా మారింది.

ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తుమ్మలపల్లి లంక రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి రాకపోకలను పునరుద్ధరించినప్పుడే ఎన్నికల్లో పాల్గొంటామని, లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.