నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :
బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని మండల విద్యాధికారి అజయ్‌కుమార్ అన్నారు. నాంపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ, బాలికలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్య, వైద్యం, విజ్ఞానశాస్త్రం, రక్షణ రంగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. బాలికలు తమ సమస్యలను నిర్భయంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు కె. అరుణ, ఎం. ఇన్నాశమ్మ, ఎం. శిరీష, ఎం. నీరజ తదితరులు పాల్గొన్నారు.


