నవపక్షం, నవపక్షం ప్రతినిధి :
నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన ముచ్చపోతుల సోమయ్య అనారోగ్య సమస్యలతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని వర్థమ్ మహేష్ (నంద) యాదవ్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలుస్తూ ₹5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పొల్లగోని వెంకటేష్, నాయకులు శివకృష్ణ, బాలకృష్ణ, ముచ్చపోతుల సైదులు, చంద్రయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


