నవపక్షం, హైదారాబాద్ ప్రతినిధి :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులు రేపు (అక్టోబర్ 30) రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య తెలిపారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో అర్హత కలిగిన రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి ఖర్చుల సమయంలో ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తున్నారని బస్వాపురం లక్ష్మీనర్సయ్య
వివరించారు. ఈ నిధులు రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

