నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
విద్యార్థుల హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె. అనిత అన్నారు. దేవరకొండ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో నిర్వహించిన “సురక్షిత బచ్పన్ అభియాన్” కార్యక్రమంలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
బాలల హక్కులు, బాల్యవివాహాలు, పోక్సో చట్టం గురించి తెలియజేశారు. విద్యార్థులకు చదువుతోపాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


