నవపక్షం, మర్రిగూడ, అక్టోబర్ 30:
మోడల్ స్కూల్ టీచర్స్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మర్రిగూడ తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 010 పద్దు ద్వారా వేతనాల చెల్లింపు, డీఏ బకాయిల విడుదల, 317 జీవో కేటాయింపుల సమస్య పరిష్కారం, టీజీటీ ఉపాధ్యాయులకు నోషనల్ బెనిఫిట్స్ కల్పించడం తదితర పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెండింగ్ డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.


