నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలు, సామాజిక సేవకురాలు, ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గీతాంజలి ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అభ్యర్థిత్వానికి మద్దతు, సహకారం అందించాలని కోరారు.
అలాగే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజన సంఘాలతో పాటు వివిధ సామాజిక సంస్థలు, సంఘాల ప్రతినిధుల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా గీతాంజలి స్పందిస్తూ, యువత, మహిళా సంఘాలు, సామాజిక సేవా సంస్థల కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తన పరిధిలో సాధ్యమైన సహకారం అందిస్తానని పేర్కొన్నట్లు డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి తెలిపారు.
అనంతరం డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మాట్లాడుతూ, గీతాంజలి తన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు, మహిళా సంఘాల ప్రతినిధులకు, బహుజన సంఘాల నాయకులకు, సామాజిక సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.


