నవపక్షం, నర్సంపేట ప్రతినిధి :
డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు సూచన మేరకు, వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేటలోని ఢఫోడిల్స్ హైస్కూల్ ఆడిటోరియంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థకు చెందిన న్యాయ ప్రతినిధులు అడ్వకేట్ డి. సాంబయ్య, అడ్వకేట్ టి. సునీత, ప్యానల్ అడ్వకేట్ ఎన్. రమేష్, అడ్వకేట్ ఎ. సుధీర్ పాల్గొని బాలల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై వేధింపుల నిరోధక చట్టాలు, విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీహెచ్ఆర్సీ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఏదైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింతల నరేందర్, డీహెచ్ఆర్సీ జిల్లా ఉపాధ్యక్షుడు భేతి భాస్కర్, జనరల్ సెక్రటరీ చెన్నూరి రవి, మండల, పట్టణ నాయకులు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


