నవపక్షం, అందోల్ ప్రతినిధి :
డాకూరు గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండల సీనియర్ నాయకులు, రైతులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు తమ ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది.
రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తారని, వారి కష్టానికి తగిన ఫలితం దక్కేలా చూడటం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
రైతులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.


