నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 1:
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన విత్తన గణపతిని ప్రముఖ నటి ఇందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అందజేశారు.
ఈ సందర్భంగా గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో విత్తన గణపతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నటి ఇందు అభినందించారు.


