రైతులు, సామాన్యుల భూములను హరించే 22A నిబంధనలను తక్షణమే ఎత్తివేయాలి: బీజేపీ మహా దీక్షలో యాదాద్రి భువనగిరి జిల్లా నేతల హెచ్చరిక

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22A) పేరుతో పేదలు, రైతులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మహా దీక్ష” కు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి లోపాలను సరిదిద్దుతామని చెప్పి, లక్షలాది ఎకరాల పట్టా భూములను ఏకపక్షంగా 22A నిషేధిత జాబితాలో చేర్చింది. దీనివల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి, అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక రైతులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వేలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, ఏలే చంద్ర శేఖర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, కదూరి అచ్చయ్య, జిల్లా కార్యదర్శి తడిసిన మల్ల రెడ్డి,జిల్లా కోశాధికారి సోమనర్సయ్య, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహా రావు, జిల్లా it సెల్ కన్వీనర్ వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ రేణుక, ఉదయ్, మండల అధ్యక్షులు ch సురేష్ రెడ్డి, భువనగిరి సాధనంద్ గౌడ్, బొల్లు సుదర్శన్, బీజేవైఎం నాయకులు పవన్ సంతోష్, మధు, శ్రీకాంత్ మరియు జిల్లాలోని మండలాల అధ్యక్షులు, కిసాన్ మోర్చా, యువమోర్చా ప్రతినిధులు, బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.