తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మోటపోతుల రమేష్ గౌడ్ నియామకం

నవపక్షం, హైదరాబాద్:

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నేత, జయశంకర్ జిల్లా గోరి కొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మోటపోతుల రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్ర రావు చేతుల మీదుగా రమేష్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. నియామక పత్రాన్ని స్వీకరించిన అనంతరం మోటపోతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గౌడ విద్యార్థులు, యువజనుల అభ్యున్నతి మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గౌడ విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

అలాగే గౌడ విద్యార్థుల కోసం జిల్లాల వారీగా గౌడ హాస్టళ్లు, గ్రంథాలయాల నిర్మాణం, విద్యా మరియు ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. గౌడ విద్యార్థి విభాగాన్ని సామాజికంగా, రాజకీయంగా మరియు ఆర్థికంగా మరింత బలోపేతం చేసి, విద్యార్థులు మరియు యువతకు మెరుగైన అవకాశాలు అందేలా కృషి చేస్తానని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు.

తనకు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్ర రావు, రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్లకు రమేష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.