నవపక్షం, నల్లగొండ, సెప్టెంబర్ 17:
నల్లగొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో విఘ్నేశ్వర యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నల్లగొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భూపాల్‌రెడ్డి పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలందరూ శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రేగటి మల్లికార్జున్‌రెడ్డి, పెండం ధనంజయ్‌నేత, మారగోని గణేష్, దీప్లా నాయక్, పెరిక యాదయ్య, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అశోక్, దొడ్డి రమేష్, చెరుపల్లి జయప్రకాశ్, మూడ వేణు, జెల్ల మధు, గంజి వెంకన్న, కైరం కొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


