నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :
నకిరేకల్ పట్టణం 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దుల మల్లేష్ మాతృమూర్తి ఈరమ్మ అనారోగ్యంతో తన స్వగ్రామమైన చిట్యాల మండలం పేరపల్లి గ్రామంలో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ పేరపల్లిలోని వారి నివాసానికి వెళ్లి ఈరమ్మ పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈరమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


