నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
భారతదేశ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ లో భాగంగా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి ప్రాధమిక పాఠశాలలో APO వట్టికోటి రాములు గారి సహకారంతో BJYM నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ విద్యార్థులకు స్కూల్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి 25వ సంవత్సరాలు దేశ సేవలో వున్నారు.ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఎదురులేని శక్తిగా భారతదేశాన్ని అగ్రగామిగ ఉంచడంలో నిరంతరం కృషి చేస్తున్నడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొలగోని శ్రీకాంత్ గౌడ్,బోల్గం శేఖర్, పొలగోని ముత్యాలు, కలగోని జగన్, పంగ లింగస్వామి,చరణ్ గౌడ్ శ్రీను సార్, రాజు సార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


